టీ నిరుద్యోగుల వయోపరిమితి మరో సంవత్సరం పెంపు | Age Relaxation 1 year extend for Unemployees in Telangana

Age relaxation 1 year extend for unemployees in telangana

Age Relaxation 1 year extend, Unemployees in Telangana, TSPSC age limit, telangana govt exams, age limit for telangana jobs

Age Relaxation 1 year extend for Unemployees for Jobs Recruitment in Telangana.

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో వరం

Posted: 07/26/2016 10:18 PM IST
Age relaxation 1 year extend for unemployees in telangana

తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. ఈ మధ్యే గ్రూప్ 2లో అదనంగా ఉద్యోగాల్ని చేరుస్తూ నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో తీపికబురందించింది. వయో పరిమితి సడలింపు మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎస్పీఎస్సీ సహా అన్ని రకాల పరీక్షలకు గతంలో ప్రభుత్వం పదేళ్ల వయసు సడలించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పొడిగింపు మరోఏడాది పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వయోపరిమితి 45 ఏళ్లకు చేసింది. 2017 జూలై 26 వరకు ఈ నిబంధన అమలు లో ఉంటుంది.

అయితే ఓవైపు వయోపరిమితి సడలింపు అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం నోటీఫికేషన్ల విషయంలో మాత్రం ఆలసత్వం ప్రదర్శిస్తుండటంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. అంతేకాదు ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా పెద్ద ఎత్తున్న గోల్ మాల్ లు జరుగుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana  CM KCR  age limit  unemployees  extend  

Other Articles